సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీలో కాసం ఫ్యాషన్స్ 28వ స్టోర్‌ను సోమవారం సినీనటి అనసూయ భరద్వాజ్ చేతుల మీదుగా ఘనంగా ప్రారంభించారు. ఈ స్టోర్ ప్రారంభించడం ఆనందంగా ఉందని అనసూయ తెలిపారు. ఆమె స్టోర్‌లోని లేడీస్, జెంట్స్, కిడ్స్ విభాగాలను సందర్శించి సందడి చేశారు. ఈ కార్యక్రమంలో కాసం నమశ్శివాయ, కాసం మల్లికార్జున్, కాసం కేదారినాథ్, కాసం శివప్రసాద్ పాల్గొన్నారు.