విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చొరవ

సిద్ధిపేట జిల్లా గజ్వేల్ విద్యుత్ శాఖ డీఈ భాను ప్రకాష్, విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చొరవ తీసుకుంటున్నట్లు తెలిపారు. సోమవారం గజ్వేల్ డివిజన్ కార్యాలయంతో పాటు, గజ్వేల్, ములుగు, తుక్కాపూర్ సబ్ డివిజన్ కార్యాలయాలలో విద్యుత్ వినియోగదారుల దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వినియోగదారుల నుంచి విద్యుత్ సమస్యలపై ఫిర్యాదులను స్వీకరించారు. గజ్వేల్ డివిజన్ పరిధిలో విద్యుత్ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్