కాంగ్రెస్ పార్టీ సిద్దిపేట జిల్లా కార్యదర్శిగా సురేష్ ఎన్నిక

సిద్దిపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా సొక్కం సురేష్ నియమితులయ్యారు. గురువారం గజ్వేల్‌లో ఆయన మాట్లాడుతూ, తనపై నమ్మకంతో ఈ అవకాశం కల్పించిన సీఎం రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి, డీసీసీ అధ్యక్షురాలు ఆంక్ష రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి, గ్రామ గ్రామాన పార్టీని బలోపేతం చేయడానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని సురేష్ అన్నారు. తనకు పదవి రావడానికి సహకరించిన ప్రతి ఒక్కరికీ ఆయన ధన్యవాదాలు తెలిపారు.

సంబంధిత పోస్ట్