కంచి కామకోటి పీఠాధిపతి జగద్గురు శంకరాచార్య విజయేంద్ర సరస్వతి మాట్లాడుతూ, దేవాలయాలు భావితరాలను హిందూ, సనాతన వైదిక ధర్మాలవైపు నడిపిస్తాయని పేర్కొన్నారు. బుధవారం సిద్దిపేట జిల్లా కొండపాక మండలంలోని మర్పడగలోని విజయదుర్గా సమేత సంతాన మల్లికార్జున స్వామిక్షేత్రంలో ఆయన విజయదుర్గ మాతకు 1000 గ్రాముల స్వర్ణకిరీటాన్ని ధరింపజేశారు. ఈ సందర్భంగా ఆయన భారతదేశం సంస్కృతి, సంప్రదాయాలకు నిలయమని, కూలీల నుంచి ఉన్నత స్థాయి ఉద్యోగుల వరకు అందరూ ఈ కార్యక్రమంలో భాగస్వాములవ్వడం గొప్ప విషయమని తెలిపారు.