రైతులు పండించిన ప్రతీ గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది

రైతులు పండించిన ప్రతీ గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని మాజీ ఎమ్మెల్యే తూంకుంట నర్సారెడ్డి అన్నారు. సిద్దిపేట జిల్లా వర్గల్ టీజీఐఐసీలోని శ్రీరామాంజనేయ, మహదేవ్ రైస్ మిల్లులను సందర్శించి ధాన్యం సేకరణ తీరుపై యాజమాన్యాలతో చర్చించారు. హమాలీల సంఖ్య పెంచి త్వరితగతిన ధాన్యం దిగుమతి జరిగేలా చర్యలు చేపట్టాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షురాలు ఆంక్షారెడ్డి, మాజీ ఎంపీపీ మోహన్, నాయకులు రంగారెడ్డి, ఉపసర్పంచ్ గోవర్ధన్ రెడ్డి, ప్రభుదాస్ గౌడ్, నర్సారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్