దివ్య వివాహానికి వంటేరు ప్రతాప్ రెడ్డి ఆర్థిక సాయం అందజేత

సిద్దిపేట జిల్లా, గజ్వేల్ నియోజకవర్గ ఇన్చార్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డి, కుకునూరు పల్లి మండలం లకుడారం గ్రామానికి చెందిన అనాథ యువతి ముక్కని దివ్య వివాహానికి రూ. 30,000 ఆర్థిక సహాయం అందించారు. రైతుబంధు సమితి రాష్ట్ర మాజీ కోఆర్డినేటర్ దేవి రవీందర్ రూ. 20,000 కలిపి మొత్తం రూ. 50,000 దివ్య కుటుంబ సభ్యులకు గురువారం అందజేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ శిల్ప నరసింహులు, ఉపసర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి, గ్రామ శాఖ అధ్యక్షులు సంతోష్ కుమార్, కానుగుల కరుణాకర్, రాచకొండ బిక్షపతి, చిరబోయిన సాయిలు, కంకణాల బిక్షపతి, దేవి భూపాల్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్