సిద్దిపేట జిల్లా వర్గల్ మండల మహాత్మా జ్యోతి బాపూలే బిసి బాలికల గురుకుల పాఠశాల మరియు జూనియర్ కళాశాలను జిల్లా కలెక్టర్ కె. హైమావతి శుక్రవారం ఆకస్మికంగా పరిశీలించారు. విద్యార్థుల స్టడీ అవర్స్ తరగతి గదుల చుట్టూ కలియ తిరిగి బాలికలతో ఆప్యాయంగా పలకరించారు. ప్రతి బాలిక బాగా చదవాలని ఇక్కడ నేర్చుకున్న విద్య భవిష్యత్ లో ఉన్నత స్థాయికి చేరుకోవడానికి పునాది వంటిదని దేనికైనా ప్రయత్నం చేస్తేనే విజయం సాధించగలుతామన్నారు.