ఘనంగా వాసవి మాత ఆలయ వార్షికోత్సవ వేడుకలు

గజ్వేల్ రామాలయంలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయ వార్షికోత్సవ వేడుకలు 2026 జూలై 4న ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా అమ్మవారికి అభిషేకం, గోపూజ, సామూహిక కుంకుమార్చన, వాసవి పారాయణం నిర్వహించి, భక్తులకు తీర్థప్రసాదాలతో పాటు మహా అన్నప్రసాదం అందజేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ మాజీ చైర్మన్ రాజమౌళి మాట్లాడుతూ, అమ్మ దయ ఉంటే అంతా మంచి జరుగుతుందని, వాసవి మాత అనుగ్రహం అందరిపై ఉండాలని ఆకాంక్షించారు.

సంబంధిత పోస్ట్