సిద్దిపేట జిల్లా కొండపాక మండలంలోని పీటీ వెంకటాపూర్ గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దనున్నట్లు సర్పంచ్ భాస్కర్ తెలిపారు. బాలవికాస సంస్థ ప్రతినిధులతో కలిసి గ్రామసభలో మాట్లాడిన ఆయన, పారిశుధ్యం, తాగునీరు, ఇతర మౌలిక వసతులు కల్పించి గ్రామాన్ని ఉత్తమంగా తీర్చిదిద్దడానికి బాలవికాస సంస్థ ముందుకు వచ్చిందని పేర్కొన్నారు. దీనికి గ్రామస్థులు, అన్ని పార్టీల నాయకులు సహకరించాలని తీర్మానించారు.