సిద్దిపేట జిల్లా, హుస్నాబాద్‌లోని అక్కన్నపేట మండలానికి చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకులు చింతల బాలరాజు, బానోతు భాస్కర్ జిల్లా కాంగ్రెస్ కమిటీ సెక్రటరీలుగా, కాశబోయిన రవి ఎగ్జిక్యూటివ్ సభ్యుడిగా శుక్రవారం నియమితులయ్యారు. ఈ నియామకాలపై వారు బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, జిల్లా అధ్యక్షురాలు ఆంక్షరెడ్డిలకు కృతజ్ఞతలు తెలిపారు.