నాటు సారా తయారీకి ఉపయోగించే బెల్లం, పటికను పట్టుకున్నట్లు ఆదివారం ఎక్సైజ్ సీఐ పవన్ తెలిపారు. అక్కన్నపేట శివారులో వాహన తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో బొత్తలపర్రె తండాకు చెందిన భూక్యా రమేశ్ బైక్ పై వెళ్తుండగా అనుమానించి ఆపారు. తనిఖీల్లో 20 కిలోల బెల్లం, 5 కిలోల పటిక, 2 లీటర్ల నాటుసారా పట్టుబడ్డాయి. ఇంకా ఇద్దరి నుంచి 980 కిలోల బెల్లం, 45 కిలోల పటిక లభించాయని, ముగ్గురిపై కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు.