స్వచ్ పట్టణంగా రూపొందించడానికి ప్రజలంతా భాగస్వాములు కావాలి

హుస్నాబాద్ పట్టణాన్ని స్వచ్ఛ పట్టణంగా తీర్చిదిద్దడంలో ప్రజల భాగస్వామ్యం అత్యవసరమని మున్సిపల్ చైర్పర్సన్ దండి లక్ష్మి పిలుపునిచ్చారు. ప్రజాపాలన- ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా 14వ వార్డులో చెత్త విభజన, ఎరువు తయారీ, ప్లాస్టిక్ నిషేధంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, చెత్తను తడి, పొడి, శానిటరీ, హానికరమైన చెత్తగా వేరు చేసి మున్సిపల్ వాహనానికి అందించాలని సూచించారు. సింగిల్ యూస్ ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధించి, బదులుగా స్టీల్ బ్యాంక్ లను వినియోగించుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

సంబంధిత పోస్ట్