ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ క్షమాపణలు చెప్పాలి

తెలంగాణ ప్రజలకు ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ క్షమాపణలు చెప్పాలని మంత్రి పొన్నం డిమాండ్ చేశారు. కోనసీమలో కొబ్బరి చెట్లు ఎండిపోవడానికి తెలంగాణ ప్రజల దిష్టి తగిలిందని పవన్ కళ్యాణ్ అనడం తెలంగాణ ప్రజలను అవమానించడమేనని ఆయన అన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో తుఫాను వస్తే తమ హుస్నాబాద్ మునిగిపోయినా, తాము ఆంధ్ర ప్రజలను నిందించలేదని, కానీ అక్కడ చెట్లు ఎండిపోతే తెలంగాణ ప్రజల దిష్టి అని అనడం సరికాదని మంత్రి పొన్నం పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్