భీమదేవరపల్లి మండలం మల్లారం గ్రామ సర్పంచ్ పదవికి పోటీ చేస్తున్న అనుషా నరేందర్, ప్రజల అభివృద్ధిని ప్రధాన లక్ష్యంగా చేసుకుని ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. గ్రామంలోని విద్యా, రహదారులు, డ్రైనేజ్, తాగునీటి సమస్యలను త్వరితగతిన పరిష్కరించడానికి కట్టుబడి ఉన్నానని ఆమె తెలిపారు. మహిళల సంక్షేమం, యువతకు ఉపాధి అవకాశాలు, ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారిస్తానని, అభివృద్ధి పథకాల అమలులో పారదర్శకత పాటిస్తూ మల్లారంను మోడల్ గ్రామంగా తీర్చిదిద్దుతానని ఆమె విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రజల ఆదరణ తమకు మరింత నమ్మకాన్నిస్తోందని ఆమె అన్నారు.