హుస్నాబాద్ మండలంలోని మడత, రాములపల్లె గ్రామాలలో విత్తన కొనుగోలుకు సంబంధించి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఏఈఓ టి. ప్రణీత సోమవారం రైతులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఏఈఓ మాట్లాడుతూ. ప్రభుత్వ లైసెన్సు కలిగిన డీలర్ల దగ్గర మాత్రమే విత్తనాలు కొనుగోలు చేసి రసీదును తప్పకుండా తీసుకోవాలని సూచించారు. పంటకాలం ముగిసే వరకు రసీదును భద్రపరచుకోవాలని ఏఈఓ ప్రణీత వివరించారు. ఈ కార్యక్రమంలో స్థానిక రైతులు పాల్గొన్నారు.