కొత్తకొండ వీరన్నకు కోడె మొక్కు చెల్లించిన బసవరాజు దంపతులు

సిద్దిపేట జిల్లా, హుస్నాబాద్ పరిధిలోని కొత్తకొండ వీరభద్ర స్వామి సమేత భద్రకాళి దేవి దర్శనానికి వరంగల్ బసవరాజు దంపతులు ఆదివారం నాడు విచ్చేశారు. పౌర్ణమి సందర్భంగా, వీరన్నకు కోడె మొక్కును చెల్లించి, గుమ్మడికాయను తలపై పెట్టుకుని గుడి చుట్టూ ప్రదక్షిణ చేశారు. కొత్తకొండ వీరన్నకు గుమ్మడికాయ సమర్పణతో పాటు కోరమీశాన్ని సమర్పించి, స్వామివారికి, అమ్మవారికి అభిషేకాలు, కుంకుమార్చనలు చేశారు. దేవస్థానం కార్యనిర్వాహణాధికారి పి. కిషన్ రావు మాట్లాడుతూ, ఎమ్మెల్యే బసవరాజు సారయ్య దంపతులు కొత్తకొండకు వస్తున్నారని తెలిపారు.

సంబంధిత పోస్ట్