బెజ్జంకి: తనిఖీల్లో అక్రమంగా నిల్వ చేసిన సిలిండర్లు స్వాధీనం

సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలోని బేగంపేటలో మంగళవారం నిర్వహించిన తనిఖీల్లో అక్రమంగా నిల్వ చేసిన వివిధ ఏజెన్సీలకు చెందిన 19 గ్యాస్ సిలిండర్లను డీఎస్ఓ తనూజ స్వాధీనం చేసుకున్నారు. సమాచారం మేరకు దాడి చేయగా ఈ సిలిండర్లు లభించాయని, రెండు కంటే ఎక్కువ సిలిండర్లు నిల్వ ఉంచరాదని ఆమె స్పష్టం చేశారు. అక్రమంగా సిలిండర్లను నిల్వ చేసిన వారిపై కేసు నమోదు చేస్తామని, గృహ వినియోగానికి కేటాయించిన డొమెస్టిక్ గ్యాస్ ను అధిక ధరలకు విక్రయించడం లేదా కమర్షియల్ అవసరాలకు మళ్లించడం చట్ట విరుద్ధమని హెచ్చరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్