అసెంబ్లీలో విద్వేష ప్రసంగాల నివారణకు బిల్లు: మంత్రి పొన్నం

విద్వేష ప్రసంగాలు, విద్వేష నేరాల నివారణ బిల్లు-2026ను మంత్రి పొన్నం ప్రభాకర్ అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. సోషల్ మీడియాలో కులమతాలను నిందిస్తూ, మనోభావాలను దెబ్బతీసేలా జరిగే విధ్వంసాలను అరికట్టేందుకు ఈ బిల్లును తీసుకొచ్చినట్లు మంత్రి తెలిపారు. నేరస్థులకు 1 నుంచి 7 ఏళ్ల వరకు జైలు శిక్ష, రూ.50 వేల వరకు జరిమానా విధించే నిబంధనలు ఇందులో ఉన్నాయని, నిందితులకు కఠిన శిక్షలు, బాధితులకు న్యాయం జరిగేలా పలు అంశాలు పొందుపరిచినట్లు ఆయన పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్