అర్హులైన ఒక్క ఓటరు కూడా మిగిలిపోకుండా శ్రద్ధ తీసుకోవాలి

హుస్నాబాద్ నియోజకవర్గ పరిధిలోని సైదాపూర్ మండలం ఏలబోతారం గ్రామంలో సోమవారం మంత్రి పొన్నం ప్రభాకర్ ఓటరు సవరణ ప్రక్రియను పరిశీలించారు. ఇంటింటికీ జరుగుతున్న ఎన్యూమరేషన్ ప్రక్రియను, ఫారాల పంపిణీ, నమోదు పురోగతి, క్షేత్రస్థాయిలో ఎదురవుతున్న సమస్యలపై అధికారులతో మాట్లాడి ఆరా తీశారు. అర్హులైన ఒక్క ఓటరు కూడా మిగిలిపోకుండా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని, 2002, 2025 ఓటరు జాబితాలను ప్రామాణికంగా తీసుకుని ప్రతి ఇంటికి ఫారాలు చేరేలా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.

సంబంధిత పోస్ట్