పేకాట ఆడుతున్న ఆరుగురిపై కేసు నమోదు

కోహెడ మండలంలోని తంగళ్లపల్లి గ్రామంలో పేకాట ఆడుతున్న ఆరుగురిని కోహెడ పోలీసులు పట్టుకున్నారు. గ్రామానికి చెందిన ఇగుర్ల ఐలయ్య ఇంట్లో పేకాట ఆడుతున్నట్లు సమాచారం అందడంతో పోలీసులు దాడి చేశారు. ఈ సందర్భంగా వేగ్గలం చంద్రమౌళి, బుర్ర రమేష్, ఎగుర్ల ఐలయ్య, చుంచు సుమన్, పిల్లి అంజయ్య, సిగిరి రాజులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ. 11, 360 నగదును స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు ఆరుగురిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

సంబంధిత పోస్ట్

✕
✕