ఎల్కతుర్తి మండల కేంద్రంలో బుధవారం జరిగిన ఇందిరా మహిళా శక్తి సంబరాలు ఘనంగా నిర్వహించారు. మహిళా సంఘాల ఆధ్వర్యంలో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సీఎం రేవంత్ రెడ్డి మహిళల పట్ల చూపుతున్న ఆదరణ, ఉచిత బస్సు, సంక్షేమ పథకాలపై కృతజ్ఞతలు తెలిపారు. మంత్రి సీతక్క పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేసి స్వీట్లు, పండ్లు పంచిపెట్టారు.