తుఫాన్ బీభత్సం: ఎల్కతుర్తిలో పంట నష్టం, రైతుల ఆవేదన

హుస్నాబాద్ నియోజకవర్గం ఎల్కతుర్తి మండలంలో తుఫాన్ ప్రభావంతో ధర్మసాగర్ మత్తడి పోయింది. దీంతో ఎల్కతుర్తి వాగు నిండుకుండలా పొంగిపొర్లుతోంది. దిగువన ఉన్న పంట పొలాలు నీట మునిగి భారీ నష్టం వాటిల్లింది. వేలాది ఎకరాలలో వరి, పత్తి, మొక్కజొన్న పంటలు దెబ్బతిన్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం సహాయక చర్యలు అందించి ఆదుకోవాలని వివిధ పార్టీల నాయకులు, రైతు సంఘాలు కోరుతున్నాయి. మరికొన్ని రోజుల్లో వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున రైతులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.

సంబంధిత పోస్ట్