సీనియర్ జర్నలిస్ట్ మృతి పత్రికా రంగానికి తీరని లోటు: మంత్రి

సీనియర్ జర్నలిస్ట్ ఫజుల్ రహమాన్ మృతి పత్రికా రంగానికి తీరని లోటని మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. శనివారం ఆయన స్వస్థలమైన హుస్నాబాద్ పట్టణంలో ఫజల్ రహమాన్ అంత్యక్రియలు జరిగాయి. పత్రికా రంగంలో సుదీర్ఘ అనుభవం కలిగిన రహమాన్ ప్రజల పక్షాన అనేక కథనాలు రాశారని మంత్రి కొనియాడారు. ఈ కార్యక్రమంలో జర్నలిస్ట్ సంఘాల నాయకులు, వివిధ పార్టీల నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్