హుస్నాబాద్ నియోజకవర్గం ఎల్కతుర్తి మండలంలో తుఫాన్ ప్రభావంతో భారీ వర్షం కురిసింది. దీనితో ధర్మసాగర్ చెరువు మత్తడి పారడంతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. ఎల్కతుర్తి ప్రధాన రహదారిపై 165 జాతీయ రహదారి బ్రిడ్జి వద్ద వర్షపు నీరు భారీగా చేరింది. దిగువన ఉన్న అనంతసాగర్ గ్రామ ఇండ్లలోకి నీరు చేరిందని బాధితులు తెలిపారు. సుమారు 100 ఎకరాల వరి పంట నీట మునిగి నష్టం వాటిల్లిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే సహాయక చర్యలు చేపట్టి రైతులకు నష్టపరిహారం అందించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు.