గురువారం, అక్కన్నపేట మండలం మోత్కులపల్లి గ్రామం వద్ద లో లెవెల్ కల్వర్టు వద్ద మోత్కులపల్లి వాగులో ప్రణయ్, కల్పన దంపతులు ద్విచక్ర వాహనంపై వెళుతూ నీటి ఉధృతికి కొట్టుకుపోయిన ప్రాంతాన్ని జిల్లా కలెక్టర్ హైమావతి అధికారులతో కలిసి పరిశీలించారు. వారి ద్విచక్ర వాహనం వాగులో చిక్కుకున్న ప్రాంతాన్ని కూడా ఆమె పరిశీలించారు. మృతుల కుటుంబ సభ్యులను ఓదార్చి, గల్లంతైన వారి బాడీలు మల్లంపల్లి చెరువు వరకు వెళ్లే అవకాశం ఉన్నందున వెంటనే ఎస్డిఆర్ఎఫ్ బృందాలను రప్పిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు.