ఇచ్చిన మాట నిలబెట్టుకున్నా... కేంద్ర మంత్రి బండి సంజయ్

కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆదివారం సిద్దిపేట జిల్లా కోహెడ మండలంలోని విజయనగరకాలనీలో పర్యటించి, ఇచ్చిన మాట ప్రకారం ఏకగ్రీవ పంచాయతీలకు రూ.10 లక్షల ప్రోత్సాహకాన్ని అందజేశారు. బీజేపీ బలపరిచిన అభ్యర్థులతో ఏకగ్రీవంగా ఎన్నికైన గ్రామ పంచాయతీలకు ఈ నిధులు కేటాయించారు. ఎంపీ ల్యాండ్స్ కింద రూ.10 లక్షల నిధుల పత్రాన్ని సర్పంచ్ అమూల్య రాజశేఖర్ కు అందజేస్తూ, హుస్నాబాద్ నియోజకవర్గంలో తాగునీటి సమస్య పరిష్కారానికి బోర్లు వేయించడం, విద్యార్థులకు సైకిళ్లు పంపిణీ చేయడం, పదో తరగతి పరీక్ష ఫీజులు చెల్లించడం వంటి పనులు చేపట్టామని తెలిపారు.

సంబంధిత పోస్ట్