తుఫాను వర్షంతో రైతు ఆవేదన: 100 క్వింటాళ్ల వరి ధాన్యం నీట మునిగి నష్టం

హుస్నాబాద్ నియోజకవర్గ ఎల్కతుర్తి మండలం రైతు అల్లి మహేందర్ తన మూడు ఎకరాల వ్యవసాయ భూముల్లో పండించిన దాదాపు 100 క్వింటాళ్ల వరి ధాన్యం తుఫాను ప్రభావంతో కురిసిన భారీ వర్షానికి నీట మునిగిందని, దీంతో తీవ్ర నష్టం వాటిల్లిందని ఆవేదన వ్యక్తం చేశారు. మూడు రోజుల క్రితం వరి కోసి, పొలంలో పరదా కప్పి ఉంచిన ధాన్యం వర్షానికి తడిసిపోయిందని, ప్రభుత్వం, వ్యవసాయ అధికారులు తక్షణమే పరిశీలించి, నష్టపరిహారం చెల్లించి ఆదుకోవాలని ఆయన కోరారు.

సంబంధిత పోస్ట్