సిద్ధిపేట జిల్లా హుస్నాబాద్‌లో బుధవారం రైతులు ధాన్యం కొనుగోళ్లలో జరుగుతున్న ఆలస్యంపై నిరసన తెలిపారు. నెల రోజులుగా కేంద్రాల్లో ధాన్యం పోసి ఎదురుచూస్తున్నా అధికారులు కాంటాలు వేయడం లేదని, అకాల వర్షాలకు ధాన్యం తడిసి నల్లబడుతోందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే కొనుగోళ్లు చేపట్టి ఆదుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు రైతులు పాల్గొన్నారు.