హుస్నాబాద్ నియోజకవర్గం, హనుమకొండ జిల్లా, ఎల్కతుర్తి మండలం పరిధిలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ఇన్‌చార్జిగా మాజీ సింగిల్ విండో చైర్మన్ గోలి రాజేశ్వరరావును నియమిస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి ఆదేశాల మేరకు ఈ నియామకం జరిగింది. తనపై నమ్మకం ఉంచి బాధ్యతలు అప్పగించినందుకు మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్, జిల్లా అధ్యక్షుడు ఇనగాల వెంకట్రాంరెడ్డి, ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డికి గోలి రాజేశ్వరరావు కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ అభివృద్ధికి, ప్రజల సమస్యల పరిష్కారానికి అంకితభావంతో పనిచేస్తానని ఆయన పేర్కొన్నారు.