ధాన్యం కొనుగోళ్లను వేగవంతంగా చేపట్టాలి: మంత్రి పొన్నం

రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, గ్రామాల్లో ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలని, రైతులు ఇబ్బందులు పడకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. మంగళవారం హుస్నాబాద్ నియోజకవర్గ పరిధిలోని సైదాపూర్ ఎంపీడీవో కార్యాలయంలో వరిధాన్యం కొనుగోలు, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు, వేసవిలో తాగునీటి సమస్య నివారణ వంటి అంశాలపై ఆయన సమీక్ష నిర్వహించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఎటువంటి ఆటంకాలు లేకుండా చర్యలు తీసుకోవాలని మంత్రి సూచించారు.

సంబంధిత పోస్ట్