గోపాల్‌పూర్‌లో భారీ వర్షం: ఇళ్లు కూలి, పంటలు మునిగి తీవ్ర నష్టం

హుస్నాబాద్ నియోజకవర్గం ఎల్కతుర్తి మండలంలోని గోపాల్‌పూర్ గ్రామంలో బుధవారం కురిసిన భారీ వర్షానికి పలు ఇళ్లు కూలిపోయాయి. వాగు నీరు ఇళ్లలోకి చేరడంతో గ్రామస్తులు రాత్రంతా వీధి బయటనే గడపాల్సి వచ్చింది. వాగులు పొంగిపొర్లడంతో పంట పొలాలు మునిగి భారీగా నష్టం వాటిల్లింది. బాధితులు వెంటనే అధికారులను పరిశీలించి, నష్టపరిహారం చెల్లించాలని కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్