హుస్నాబాద్: రైతుల నుంచి 526 మెట్రిక్ టన్నుల ధాన్యము కొనుగోలు

మోంథా తుపాన్ ప్రభావంతో హుస్నాబాద్ మార్కెట్ యార్డులో తడిసిన ధాన్యాన్ని అధికారులు శుక్రవారం కొనుగోలు చేశారు. మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశాలు, సివిల్ సప్లయ్ కమిషనర్, కలెక్టర్ హైమావతి మార్గదర్శకత్వంలో అధికారులు మార్కెట్ యార్డును సందర్శించి, రైతులు నష్టపోకుండా తడిసిన ధాన్యం మొత్తాన్ని కొనుగోలు చేస్తామని హామీ ఇచ్చారు. ఈ మేరకు 18 లారీలను ఏర్పాటు చేసి, 100 మందికి పైగా హమాలీ కార్మికులను రంగంలోకి దింపి, 100 మందికి పైగా రైతుల నుంచి సుమారు 526 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశారు.

సంబంధిత పోస్ట్