హైదరాబాద్‌లోని బంజారాహిల్స్ బంజారా భవన్‌లో రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్, BRS MLC దాసోజు శ్రవణ్ మధ్య మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. గత పదేళ్లలో బీఆర్ఎస్ పార్టీ ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదని పొన్నం ప్రభాకర్ సభలో మాట్లాడటంతో వెంటనే ఆ వ్యాఖ్యలను దాసోజు ఖండించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం 6 లక్షల రేషన్ కార్డులు ఇచ్చిందని చెప్పారు. ఈ క్రమంలోనే రసాభాస నెలకొంది. కాసేపటి తర్వాత సభ సజావుగా సాగింది.