హుస్నాబాద్ పట్టణంలోని డబుల్ బెడ్రూం ఇళ్ల కాలనీవాసులు మంగళవారం తమ సమస్యల పరిష్కారం కోరుతూ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. కాలనీలో డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేదని, వీధి దీపాలు ఏర్పాటు చేయాలని, పారిశుద్ధ్య నిర్వహణ మెరుగుపరచాలని వారు డిమాండ్ చేశారు. ఈ నిరసనలో బీఆర్ఎస్ నాయకులు సుద్దాల చంద్రయ్య, మల్లికార్జున్ రెడ్డి, వికాస్, లక్ష్మణ్ తో పాటు కాలనీవాసులు పాల్గొన్నారు.