హుస్నాబాద్: నియోజకవర్గ సమగ్రాభివృద్ధికి భారీగా నిధులు మంజూరు

హుస్నాబాద్ నియోజకవర్గ సమగ్రాభివృద్ధికి ప్రభుత్వం భారీగా నిధులు మంజూరు చేసిందని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. అక్కన్నపేట మండల కేంద్రంలో నూతన తహసీల్దార్ కార్యాలయ భవన నిర్మాణానికి రూ. 2.25 కోట్లు కేటాయించారు. ఈ నిధుల మంజూరుపై నియోజకవర్గ ప్రజలు, ప్రజాప్రతినిధులు మంత్రి పొన్నం ప్రభాకర్ కు ధన్యవాదాలు తెలిపారు. రహదారుల అభివృద్ధితో గ్రామీణ ప్రాంతాలకు రవాణా సౌకర్యాలు మెరుగుపడతాయని మంత్రి పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్