హుస్నాబాద్: వాహనం ఢీకొని వ్యక్తి మృతి

మంగళవారం సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలో వాహనం ఢీకొని పోగుల యాదగిరి అనే వ్యక్తి మృతి చెందాడు. ఇంటి నుంచి సైకిల్‌పై హోటల్‌కు వస్తున్న యాదగిరిని మున్సిపల్ కార్యాలయం వద్ద వెనుక నుంచి వచ్చిన పాల వ్యాన్ ఢీకొట్టింది. ఈ ఘటనలో తీవ్ర గాయాలైన యాదగిరిని వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు. ఈ ఘటనపై ఎస్ఐ లక్ష్మారెడ్డి వివరాలు వెల్లడించారు.

సంబంధిత పోస్ట్