హుస్నాబాద్: వడదెబ్బతో పాల వ్యాపారి మృతి

తీవ్రమైన ఎండల కారణంగా వడదెబ్బ తగిలి పాల వ్యాపారి బల్లు సంపత్ హుస్నాబాద్ పట్టణంలో మృతి చెందారు. ఇంటింటికీ పాలు పంపిణీ చేసే సంపత్, పాలు వేసి ఇంటికి వచ్చి సేద తీరుతుండగా అకస్మాత్తుగా కుప్పకూలిపోయారు. కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని, ఎక్స్గ్రేషియా చెల్లించాలని పలువురు విజ్ఞప్తి చేశారు.

సంబంధిత పోస్ట్