సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నుండి కరీంనగర్‌కు వెళ్తున్న మార్గమధ్యంలో మంత్రి పొన్నం ప్రభాకర్ ఉపాధి హామీ పథకం కింద పనిచేస్తున్న కూలీలను కలిసి వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఉపాధి హామీ పనుల పురోగతి, నిర్వహణ, వేతనాల చెల్లింపులు, పని పరిస్థితులపై కూలీలతో చర్చించారు. గ్రామీణ పేదలకు ఉపాధి కల్పనలో ఈ పథకం కీలకమని, కూలీల సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని, పథకం అమలులో ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి తెలిపారు.