హుస్నాబాద్‌: సీఎంకి లేఖ రాసిన మంత్రి పొన్నం

హుస్నాబాద్‌లోని శాతవాహన యూనివర్సిటీ ఇంజినీరింగ్ కాలేజీలో మైనింగ్ ఇంజినీరింగ్ కోర్సు మంజూరు చేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. ఉత్తర తెలంగాణలో సింగరేణి గనుల కార్యకలాపాలు అధికంగా ఉన్నందున మైనింగ్ ఇంజినీర్లకు డిమాండ్ పెరిగిందని, ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులకు ప్రభుత్వ కళాశాలలో ఈ కోర్సు అందుబాటులోకి వస్తే ప్రయోజనం కలుగుతుందని ఆయన పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్