తెలంగాణ నుండి ఆసియా కప్ భారత మహిళా సాఫ్ట్ బాల్ జట్టుకి ఎంపికైన చెపుర్వ ప్రవళికను శనివారం హుస్నాబాద్ ఎమ్మెల్యే, మంత్రి పొన్నం ప్రభాకర్ అభినందించి శుభాకాంక్షలు తెలియజేశారు. తెలంగాణ నుండి భారత మహిళా జట్టు క్రీడాకారిణిగా ఎంపికవడం పట్ల మంత్రి పొన్నం ప్రభాకర్ సంతోషాన్ని వ్యక్తం చేశారు. చైనాలోని జియాన్ లో జరగనున్న ఆసియా కప్ బాల్ పోటీల్లో ప్రవళిక బాగా రాణించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆకాంక్షించారు.