హుస్నాబాద్ మండలం గాంధీ నగర్ కు చెందిన భోజ అనిల్ కుమార్ కుటుంబం తమ ఇంటి ముందు 'ఓటు రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కు- ఆ ఓటును మేము అమ్ముకోము' అని ఫ్లెక్సీ ఏర్పాటు చేసింది. స్థానిక ఎన్నికల నేపథ్యంలో వారి ఈ చర్య అందరి ప్రశంసలు అందుకుంటోంది. నిజాయితీగా ఓటు వేస్తేనే ప్రజాస్వామ్యం గెలుస్తుందని వారు అభిప్రాయపడ్డారు.