హుస్నాబాద్: రైతుల పక్షాన నిరంతరం పోరాటం కొనసాగిస్తాం

రైతు రక్షణ సమితి ఆధ్వర్యంలో హుస్నాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డ్‌లోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. రైతులు కష్టపడి పండించిన ధాన్యాన్ని ప్రభుత్వం పూర్తిగా కొనుగోలు చేసే వరకు రైతుల పక్షాన నిలబడి పోరాటం కొనసాగిస్తామని రైతు రక్షణ సమితి హుస్నాబాద్ డివిజన్ అధ్యక్షులు అయిలేని మల్లికార్జున రెడ్డి తెలిపారు. గతంలో ఎరువుల కొరత, సరైన సమయంలో అందక రైతులు ఇబ్బందులు పడ్డారని, మే నెల చివరి వారంలో పూర్తి కావాల్సిన ధాన్యం కొనుగోళ్లు 15 రోజులు ఆలస్యమయ్యాయని ఆయన పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్