ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి పనులు బేస్మెంట్ వరకు పనులు జరుపుకున్న వారికి మొదటి విడతగా లక్ష రూపాయల చెక్కులను అందజేసే ప్రక్రియ ప్రారంభమయింది. అందులో భాగంగా సిద్దిపేట జిల్లా కోహెడ మండలం పోరెడ్డిపల్లి గ్రామంలో రాజవ్వ అనే మహిళకు ఇందిరమ్మ ఇళ్ల మొదటి విడత లక్ష రూపాయల చెక్కును మంగళవారం అందజేశారు. మంత్రి పొన్నం ప్రభాకర్ సమక్షంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి రాజవ్వకి చెక్కు అందజేశారు.