సిద్ధిపేట జిల్లా గౌరవెల్లి ప్రాజెక్టుకు నీరు తీసుకువచ్చే బాధ్యత తనదేనని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. శనివారం ఆయన అక్కన్నపేట మండలం గౌరవెల్లి ప్రాజెక్టు కుడి కాల్వను 15 కిలోమీటర్లు బైక్ పై వెళ్లి పరిశీలించారు. నియోజకవర్గంలో మైనర్ కాల్వలకు 1200 ఎకరాల భూసేకరణకు రూ. 250 కోట్ల నిధులు విడుదల చేసేందుకు సీఎం సానుకూలంగా ఉన్నారని తెలిపారు. ఈ ప్రాజెక్టు ద్వారా 57 వేల ఎకరాలకు, గండిపెల్లి ప్రాజెక్టు ద్వారా మరో 14 వేల ఎకరాలకు సాగునీరు అందుతుందని పేర్కొన్నారు.