సిద్ధిపేట జిల్లా కొహెడలో రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ త్వరలో పర్యటించనున్నందున సభ జరిగే మండల కేంద్రంలోని శ్రీలక్ష్మీ గార్డెన్ ను జిల్లా కలెక్టర్ హైమావతి శనివారం పరిశీలించి సూచనలు చేశారు. గార్డెన్ మొత్తం శుభ్రంగా తీర్చిదిద్దాలని ఎంపీడీవోను ఆదేశించారు. గార్డెన్ పక్కన గల ఖాళీ స్థలంను పరిశీలించి అవసరమైతే హెలిప్యాడ్ వాడుకునేందుకు పిచ్చి మొక్కలను తొలగించి భూమిని సిద్ధం చేయాలని ఆర్ అండ్ బి డిఈని ఆదేశించారు.