పచ్చదనంతోనే పర్యావరణాన్ని పరిరక్షించడం సాధ్యపడుతుందని మానకొండూర్ ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ అన్నారు. వన మహోత్సవంలో భాగంగా శుక్రవారం మానకొండూర్ మండల కేంద్రంలోని ట్యాంక్ బండ్ (చెరువు గట్టు), మండల పరిషత్ కార్యాలయ ప్రాంగణంలో జిల్లా అదనపు కలెక్టర్, ఎమ్మెల్యే మొక్కలు నాటి నీరు పోశారు.