ముఖ్యమంత్రి బహిరంగ సభ ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి

సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గంలో మంగళవారం మంత్రి పొన్నం ప్రభాకర్ పర్యటించారు. ఉదయాన్నే సిద్ధేశ్వరాలయంలో, హుస్నాబాద్ రేణుకా ఎల్లమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం, బుధవారం జరగబోయే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బహిరంగ సభ ఏర్పాట్లను పరిశీలించి, స్టేజి పనులు వేగవంతం చేయాలని సూచించారు. పార్కింగ్ ప్రదేశాలను సందర్శించి, వాహనాల రాకపోకలకు ప్రత్యేక మార్గాలపై పోలీసులకు సూచనలు చేశారు.

సంబంధిత పోస్ట్