ముఖ్యమంత్రి బహిరంగ సభ ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి పొన్నం

ఈ నెల 3వ తేదీన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హుస్నాబాద్‌లో నిర్వహించనున్న బహిరంగ సభ ఏర్పాట్లను మంత్రి పొన్నం ప్రభాకర్ సోమవారం పరిశీలించారు. స్టేజి, ఎల్ఈడి స్క్రీన్లు, మౌలిక సదుపాయాలు, తాగునీరు, మొబైల్ టాయిలెట్స్, పార్కింగ్, హెలిపాడ్ ప్రాంతాలను ఆయన తనిఖీ చేశారు. సభకు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని, ట్రాఫిక్‌కు ఇబ్బంది కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యమంత్రి పర్యటనపై అధికారులకు దిశా నిర్దేశం చేశారు.

సంబంధిత పోస్ట్