భార్య, భర్తలు గల్లంతైన ప్రాంతాన్ని పరిశీలించిన మంత్రి పొన్నం

హుస్నాబాద్ నియోజకవర్గం అక్కన్నపేట మండలం మోత్కులపల్లె వాగులో బైక్‌పై వెళ్తుండగా కొట్టుకుపోయిన ప్రణయ్, కల్పన అనే దంపతులు గల్లంతైన ప్రాంతాన్ని గురువారం మంత్రి పొన్నం ప్రభాకర్ పరిశీలించారు. 24 గంటలు గడిచినా వారి ఆచూకీ లభించకపోవడంతో, రెస్క్యూ ఆపరేషన్ ముమ్మరం చేయాలని చీఫ్ సెక్రెటరీ రామకృష్ణతో మంత్రి మాట్లాడారు. జిల్లా కలెక్టర్, పోలీసు కమిషనర్లకు సెర్చ్ ఆపరేషన్ వేగవంతం చేయాలని ఆదేశించారు. గల్లంతైన వారి కుటుంబ సభ్యులను మంత్రి ఓదార్చారు.

సంబంధిత పోస్ట్