కోహెడ మండలం కూరెళ్లలో ఏరువాక పౌర్ణమి సందర్భంగా సోమవారం రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ రైతులతో కలిసి నాగలి పట్టి విత్తనాలు చల్లి ఖరీఫ్ వ్యవసాయ పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన రైతులకు ఏరువాక పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేస్తూ, రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురిసి పాడిపంటలు బాగా పండాలని ఆకాంక్షించారు. రైతు దేశానికి వెన్నెముక అని పేర్కొంటూ, రైతు సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు.